నేను ఎవరితోనూ లేచిపోలేదు : శివాని రాజశేఖర్

November 24, 2022


img

శివాని రాజశేఖర్. రాజ్‌ తరుణ్ ప్రధాన పాత్రలలో ‘ఆహా నా పెళ్ళంట’ వెబ్‌ సిరీస్‌ ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సీరియల్‌కి తక్కువ వెబ్‌ సిరీస్‌కి ఎక్కువ అన్నట్లు దానిని కాస్త సాగదీయకపోయుంటే క్రిస్పీగా ఎడిటింగ్ చేసిఉంటే అది తప్పకుండా వారికి చాలా ప్లస్ పాయింట్ అయ్యుండేదని చెప్పవచ్చు. 

ఇక విషయానికి వస్తే ఈ మద్య సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న పుకార్లపై శివాని స్పందిస్తూ, “ఇప్పుడు సోషల్ మీడియాలో బ్రతికి ఉన్నవారినే చంపేస్తున్నారు. హాస్పిటల్‌కి వెళితే వెంటిలేటర్ మీద ఉన్నారని రాసేస్తున్నారు. నాలుగు రోజులు సోషల్ మీడియాలో కనబడకపోతే సెలబ్రేటీలు విడాకులు తీసుకొంటున్నారని వ్రాసేస్తున్నారు. అలాగే నేను ఎవరితోనో లేచిపోయానని కూడా వ్రాసేశారు. మొదట్లో ఇటువంటి పుకార్లు చూసి చాలా ఆందోళన చెందేదానిని. కానీ తర్వాత అలవాటైపోయింది.

అయినా చనిపోయారు... విడిపోయారనే పుకార్ల కంటే నా గురించి వ్రాసింది చాలా చిన్న పుకారే అని భావిస్తున్నాను. కనుక దాని గురించి పట్టించుకోను. అయినా నాకు వీటన్నిటి గురించి ఆలోచించే తీరిక, ఓపికా రెండూ లేవు. నా పెళ్ళి ఎప్పుడు? అని కొందరు అడుగుతున్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ప్రవేశించిన నాకు అప్పుడే పెళ్ళేమిటీ? బాగా సెటిల్ అయిన తర్వాతే చేసుకొంటాను. అయినా నా పెళ్ళి గురించి ఇంకా మా అమ్మానాన్నలే (జీవిత, రాజశేఖర్) ఆలోచించడంలేదు. అపరిచిత వ్యక్తులు ఆలోచిస్తుండటం చూసి చాలా నవ్వొస్తోంది,” అని అంది శివాని రాజశేఖర్. 


Related Post

సినిమా స‌మీక్ష