బాస్ పార్టీ... హేయ్ నువ్వు గ్లాసందుకో... హేయ్ నువ్వు ముక్కందుకో

November 23, 2022


img

మెగాస్టార్ చిరంజీవి, కెఎస్ రవీంద్ర (బాబీ) కాంబినేషన్‌లో తెర కెక్కుతున్న మాస్ మసాలా మూవీ ‘వాల్తేర్ వీరయ్య’ తొలి లిరికల్ వీడియో సాంగ్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో విడుదలైంది. “వెల్ కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ... బాస్ పార్టీ అంటూ పాట మొదలుపెట్టి ‘నువ్వు లుంగీ ఎస్కో... హేయ్... నువ్వు షార్ట్ కూడా ఎస్కో హేయ్... నువ్వు కర్చీఫ్ ఎస్కో హేయ్...బాస్ వస్తుండు... హేయ్.. ’ అంటూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చెపుతుంటే మెగాస్టార్ చిరంజీవి లుంగీ ఎగేసి కట్టి స్టయిల్‌గా నోట్లో బీడీ పెట్టుకొని నోట్లో నుంచి పొగ వదులుతూ ఎంట్రీ ఇచ్చి గ్రూప్ డ్యాన్స్ లో పాల్గొంటారు. బాస్ పార్టీ ఎక్కడ జరుపుకొంటే ఎలా ఉంటుందనేది లిరిక్స్ సారాంశం!

 ఈ పాటలో బాలీవుడ్‌ భామ ఊర్వశీ రౌతేల చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసింది. చిరంజీవి డ్యాన్స్, పాట రెండూ పక్కా మాస్‌గా ఉన్నాయి. కనుక ఆ సెక్షన్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందని చెప్పవచ్చు. పాట మద్యలో ఓసారి మళ్ళీ చివరిలో ఓసారి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ “నువ్వు గ్లాసందుకో... హేయ్, నువ్వు చుక్కేసుకో... హేయ్” అంటూ హడావుడి చేయడం వెరైటీగా ఉంది. పుష్పలో ‘తగ్గేదెలే...’ అన్నట్లు  రేపటి నుంచి “నువ్వు షర్టేసుకో... హేయ్, నువ్వు చుక్కేసుకో... హేయ్” అనే ఈ పదాలే ట్రెండింగ్ అవుతాయేమో?       

వాల్తేర్ వీరయ్యలో చిరంజీవికి జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాకు బాబీ కధ, డైలాగ్స్ అందించగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

 


Related Post

సినిమా స‌మీక్ష