టాలీవుడ్‌లో మరో విషాదం.. దర్శకుడు మదన్ ఆకస్మిక మృతి

November 19, 2022


img

సూపర్ స్టార్ కృష్ణ మృతి ఇంకా కళ్ళలో మెదలాడుతుండగానే తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. దర్శకుడు మదన్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్‌లో చేర్చగా చికిత్స పొందుతూ  ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. 

ఏపీలో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లికి చెందిన మదన్ సినీ పరిశ్రమలో మాటల రచయితగా ప్రవేశించి రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, మోహన్ బాబు, ఉదయ్ కిరణ్ తదితర అనేకమంది ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘ఆ నలుగురు’ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ సినిమాకు వ్రాసిన డైలాగ్స్ మదన్‌కు గొప్ప పేరు తెచ్చాయి. 

ఆ తర్వాత పెళ్ళయిన కొత్తలో సినిమాతో మదన్ దర్శకుడిగా మారారు. ఆ సినిమా హిట్ అవడంతో గుండె జల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, చివరిగా 2018లో మోహన్ బాబుతో గాయత్రి సినిమా చేశారు. మంచి మాటల రచయితగా, ప్రతిభావంతుడైన దర్శకుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకొన్న మదన్ ఇంత చిన్న వయసులో హాటాన్మరణం చెందడం ఇండస్ట్రీలో అందరూ షాక్ అవుతున్నారు. పలువురు ప్రముఖులు సంతాపం మదన్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు. 

బాలీవుడ్‌లో సీనియర్ నటి తబస్సుమ్ గోవిల్ శనివారం ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు. చైల్డ్ ఆర్టిస్టుగా హిందీ సినీ పరిశ్రమలో ప్రవేశించిన తబస్సుమ్ 1972 నుంచి 1993 వరకు దూర్ దర్శన్‌లో ఏకధాటిగా 21 ఏళ్లపాటు ‘ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్’ పేరిట సెలబ్రేటీలతో టాక్ షో విజయవంతంగా నిర్వహించారు. బాలీవుడ్‌లో అనేక సినిమాలలో ఆమె నటించారు. మరో పది రోజులలో ఓ సినిమా షూటింగ్‌లో ఆమె నటించవలసి ఉంది. కానీ శనివారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆమె కుమారుడు హొషాంగ్ గోవిల్ తెలిపారు. 


Related Post

సినిమా స‌మీక్ష