త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతున్న అమీర్ ఖాన్ కుమార్తె ఈరా ఖాన్

November 19, 2022


img

ప్రముఖ బాలీవుడ్‌లో నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతోంది. తన ఫిట్‌నెస్ ట్రైనర్‌తో నుపూర్ శిఖారే తోనే ప్రేమలో పడి అతనినే పెళ్ళి చేసుకోబోతోంది. శుక్రవారం ముంబైలో వారి వివాహ నిశ్చితార్ధ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్త (ఐరాఖాన్ తల్లి) ఆమె కుమారుడు జూనైద్ , అమీర్ ఖాన్ రెండో భార్య కిరణ్ రావు ఆమె కుమారుడు ఆజాద్ రావు ఖాన్, అమీర్ ఖాన్ తల్లి జీనత్, అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్, నుపూర్ శిఖారే తల్లితండ్రులు, ఇరు కుటుంబాల బంధు మిత్రులు హాజరయ్యారు. త్వరలోనే వారి వివాహానికి సంబందించి పూర్తి వివరాలు తెలియజేస్తామని అమీర్ ఖాన్ తెలిపారు. 

ఐరాఖాన్ నాటక రంగం దర్శకురాలిగా, సినీ దర్శకురాలిగా పొందిన గుర్తింపు కంటే, వివాదాలతోనే అందరి దృష్టిలో ఎక్కువగా పడిందని చెప్పవచ్చు. ఐరాఖాన్, నుపూర్ శిఖారేలు గత రెండేళ్ళుగా ప్రేమించుకొంటున్నారు. వారు తమ ప్రేమని ఏనాడూ రహస్యంగా ఉంచాలనుకోకపోవడంతో సోషల్ మీడియాలో వారిద్దరి ఫోటోలు, ముద్దు ముచ్చట్లు దర్శనమిస్తుండేవి. ఇటీవల ఓ ఈవెంట్‌లో నుపూర్ శిఖారే ఆమెకు ‘ప్రపోజ్’ చేయగా ఆమె చాలా సంతోషంగా మైక్ తీసుకొని అందరికీ వినబడేలా ‘ఓకె’ చెప్పింది.


Related Post

సినిమా స‌మీక్ష