జాతీయ ఉత్తమ నటులుగా సూర్య, అజయ్ దేవగణ్‌లకి అవార్డులు

October 01, 2022


img

కోలీవుడ్, బాలీవుడ్‌ నటులు సూర్య, అజయ్ దేవగణ్‌లు ఉత్తమ నటులుగా జాతీయ స్థాయి అవార్డులు అందుకొన్నారు. శుక్రవారం ఢిల్లీలో విఘ్నయన్ భవన్‌లో జరిగిన 68వ జాతీయ సినీ అవార్డుల కార్యక్రమం (2020)కి గాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వారిద్దరూ అవార్డులు అందుకొన్నారు. 

సామాన్యులకు సైతం విమానయానం అందుబాటులోకి తీసుకువచ్చిన ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థ అధినేత గోపీనాథ్ జీవిత కధ ఆధారంగా తమిళంలో తెరకెక్కిన ‘సూరారై పోట్రు’ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) సినిమాకు గాను సూర్యకు జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు లభించింది. ఉత్తమ చిత్రం, స్క్రీన్ ప్లే విభాగంలో కూడా ‘సూరారై పోట్రు’ ఎంపికైంది. ఈ అవార్డులను జ్యోతిక, సుధా కొంగర అందుకొన్నారు.       

బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగణ్‌కి హిందీ చిత్రం తానాజీకి ఉత్తమ నటుడు అవార్డు అందుకొన్నారు. 

అల్లు అర్జున్‌ నటించిన అల వైకుంఠపురములో సినిమాకు మ్యూజిక్‌ కేటగిరీలో అవార్డు లభించింది. దీనికి సంగీతం అందించిన తమన్ ఈ అవార్డును అందుకొన్నారు. 

తెలుగులో ‘కలర్ ఫోటో’ సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు లభించింది. ఈ చిత్ర దర్శకనిర్మాతలు సందీప్ రాజ్‌, సాయి రాజేష్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకొన్నారు. 

నాట్యం చిత్రానికి ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాలలో రెండు అవార్డులు లభించగా వాటిని ఆ చిత్ర నిర్మాత, నటి సంద్యారాజు, మేకప్ ఆర్టిస్ట్ టివి రాంబాబు అందుకొన్నారు.     

అలనాటి ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆశా పరేఖ్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన దాదా ఫాల్కే అవార్డు అందుకొన్నారు. Related Post

సినిమా స‌మీక్ష