హైకోర్టుకి బిగ్ బాస్... షోలో ఈ అశ్లీలత ఏంటి?

September 30, 2022


img

నాగార్జున హోస్ట్‌గా స్టార్ మా మరియు డిస్నీ +హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ (తెలుగు)పై చాలా విమర్శలే వినిపిస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకోవడానికి ఆ షోలో అశ్లీలత డోస్ పెంచడం, దానిలో పాల్గొంటున్నవారు కూడా పోటీలుపడి అశ్లీలంగా, అతిగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సీపీఐ నేత నారాయణ అయితే అదొక ‘బ్రోతల్ హౌస్’ అని అనేశారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. రాన్రాను ఈ షోలో అశ్లీలత పెరుగుతుండటంతో కుటుంబంలో అందరూ కూర్చొని చూడలేని పరిస్థితి ఏర్పడింది. 

దీనిపై అభ్యంతరం తెలుపుతూ శివప్రసాద్ రెడ్డి అనే న్యాయవాది ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేయగా దానిపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది. బిగ్ బాస్ షోలో ఐబీఎఫ్ మార్గదర్శకాలను పాటించడం లేదని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కూడా పిటిషనర్‌ వాదనతో ఏకీభవిస్తూ, “1970లలో ఎటువంటి సినిమాలు వచ్చాయో, అవి ఎంత హుందాగా ఉండేవో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంట్లో అందరూ కలిసి చూడలేనివిదంగా ఈ సినిమాలు, షోలు ఉంటున్నాయి. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా?”అంటూ నిలదీశారు. 

హైకోర్టు ప్రశ్నపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాది దీనికి సమాదానం ఇచ్చేందుకు తనకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్‌ 11వ తేదీకి వాయిదా వేసింది. 


Related Post

సినిమా స‌మీక్ష