కమెడియన్ అలీ జనసేనలోకి?

September 29, 2022


img

తెలుగు సినీ ప్రేక్షకుల అభిమాన హాస్యనటుడు అలీకి రాజకీయాలపై మొదటి నుంచి ఆసక్తి ఉండటంతో మొదట టిడిపిలో చేరారు. ఎప్పటికైనా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టాలనేది ఆయన చిరకాలవాంఛ. టిడిపిలో అది తీరకపోవడంతో 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోచేరాడు. టికెట్ ఇస్తే రాజమండ్రి లేదా కర్నూలు నుంచి పోటీ చేయాలనుకొన్నాడు కూడా రాలేదు. ఆ తర్వాత రాజ్యసభ సీటు ఇస్తామని సిఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ మూడేళ్ళు గడిచినా ఇంతవరకు ఎమ్మెల్సీ, కనీసం వక్ఫ్ బోర్డు సీటు కూడా ఇవ్వలేదు. కనుక అలీ తన కల నెరవేర్చుకోవడానికి ఈసారి జనసేన పార్టీలో చేరాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో కలిసి చాలా సినిమాలు చేశాడు.. ఇంకా చేస్తుంటాడు కనుక వారిద్దరి మద్య మంచి స్నేహం, అనుబందం కూడా ఉంది. కనుక జనసేనలో చేరాలని అలీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అలనాటి అందాల నటి జయప్రద కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలలోకి రావాలనుకొంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బిజెపిలో ఉన్న ఆమె కూడా రాజమండ్రీ నుంచే పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. కానీ వచ్చే ఎన్నికలలో తెలంగాణలో టిఆర్ఎస్‌ను ఓడించి అధికారంలోకి రావాలని బిజెపి చాలా పట్టుదలగా ఉన్నందున బిజెపి ఆమెను తెలంగాణ నుంచే పోటీ చేయించే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష