పుష్ప2లో కాజల్ ఐటెమ్ చేస్తుందట...నిజమేనా?

September 28, 2022


img

అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటిస్తున్న పుష్ప-2 సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కాబోతోంది. పుష్ప మొదటిభాగం ఓ సూపర్ హిట్ కాగా దానిలో సమంత చేసిన ‘ఊ అంటావా మావా... ఉఊ అంటావా...” అనే ఐటెమ్ సాంగ్‌ మరో సూపర్ హిట్‌గా నిలిచింది. కనుక పుష్ప2లో అదే స్థాయిలో ఓ ఐటెమ్ సాంగ్ ఉండబోతోంది. అయితే ఈ సారి ఆ ఐటెమ్ సాంగ్‌కు సమంత బదులు కాజల్‌ అగర్వాల్‌ని ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో టాక్. ఆమె పెళ్ళి చేసుకొన్న తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇటీవలే ఆమె ఓ మొగపిల్లాడిని కంది కూడా. కానీ ఆమె మళ్ళీ సినిమాలు చేసేందుకు సిద్దమవుతోంది. ముందుగా శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో మళ్ళీ మొదలైన భారతీయుడు-2లో సినిమాలో ఆమె నటించబోతోంది. దీని కోసం ఆమె మళ్ళీ జిమ్‌కి వెళ్ళి శ్రమిస్తోంది. అలాగే గుర్రపుస్వారీ కూడా ప్రాక్టీస్ చేస్తోంది. కాజల్ అగర్వాల్ మళ్ళీ పూర్తిస్థాయిలో సన్నదం అవుతున్నందున ఆమెను పుష్ప2లో ఐటెమ్ సాంగ్‌కు దర్శకుడు సుకుమార్ ఎంచుకొన్నట్లు తాజా సమాచారం. 

ఇంతకు ముందు కాజల్‌ అగర్వాల్‌ ఎన్టీఆర్‌ హీరోగా చేసిన జనతా గ్యారేజి సినిమాలో ‘నేను పక్కా లోకల్’ అనే ఐటెమ్ సాంగ్ చేసింది. దానికి మంచి స్పందన వచ్చింది. కనుక ఈసారి పుష్పా2లో ఐటెమ్ సాంగ్‌కు సుకుమార్ ఆమెను ఎంచుకొన్నట్లు తాజా సమాచారం.అయితే ఈ విషయం ఇంకా దృవీకరించవలసి ఉంది.   

 పుష్ప1 దేశవిదేశాలలో సూపర్ హిట్ అవడంతో పుష్ప2ని రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప1కి అత్యద్భుతమైన సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాదే ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు.


Related Post

సినిమా స‌మీక్ష