అక్టోబర్ 2న ఆది పురుష్ టీజర్‌ విడుదల

September 27, 2022


img

ప్రభాస్‌ తొలిసారిగా చేస్తున్న పౌరాణిక సినిమా ఆది పురుష్. దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాధను ఆది పురుష్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. దీనిలో కృతీ సనన్, ప్రభాస్‌ సీతారాములుగా నటిస్తుండగా, బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. 

అయితే ప్రభాస్‌ సినిమాలకు సంబందించి ఎటువంటి అప్‌డేట్స్ లేకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలోనే అసహనం వ్యక్తం చేస్తుండటంతో, ఆది పురుష్ టీజర్‌ను అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని శ్రీరామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో సరయూనది ఒడ్డున రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు ఓం రౌత్ ట్విట్టర్‌లో ప్రకటించారు. అదే రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. 

 రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా 2023, జనవరి 12న విడుదల కాబోతోంది. భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు.   Related Post

సినిమా స‌మీక్ష