ఇకపై సలార్ సెట్స్‌లోకి మొబైల్ ఫోన్స్ నిషేదం

September 26, 2022


img

మొబైల్ ఫోన్స్ .. వాటిలో శక్తివంతమైన కెమెరాలు అందుబాటులోకి వచ్చాక వాటితో ప్రజలకు ఎంత సౌకర్యంగా ఉందో అంతకంటే ఎక్కువ ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఫోన్‌లో తమ ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్నారో తెలీని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా రూ.200 కోట్లు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘సలార్’ మూవీకి సంబందించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవి చూసి ప్రశాంత్ నీల్‌, ప్రభాస్‌ షాక్ అయ్యారు. సినిమా షూటింగ్ జరుగుతుండగానే లొకేషన్‌లోని ఫోటోలు, వీడియోలు బయటకి లీక్ అయిపోతే అది సినిమా ఫలితంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. కనుక ఇక నుంచి హీరో,హీరోయిన్లు ప్రభాస్‌, శృతి హాసన్‌తో సహా సెట్‌లోకి ఎవరో మొబైల్ ఫోన్‌లు తీసుకురాకూడదని ప్రశాంత్ నీల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్స్ పెట్టుకొనేందుకు లొకేషన్‌కు కాస్త దూరంలో ఖాళీగా ఉన్న కారు లేదా వ్యాన్‌లో పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. 

సలార్ చిత్రంలో జగపతిబాబు, ఈశ్వరీరావు, మధు గురుస్వామి, పృధ్వీరాజ్ సుకుమార్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు సినీ నిర్మాణ సంస్థ హంభలే ప్రకటించింది.


Related Post

సినిమా స‌మీక్ష