రష్మిక మందన ఫోటో షూట్... పైన కూడా షార్ట్ జీన్స్!

September 26, 2022


img

రష్మిక మందన ఇంతవరకు చేసిన సినిమాలన్నిటిలో చాలా గ్లామరస్ పాత్రలే చేసింది. కానీ తొలిసారిగా పుష్ప సినిమాలో డీ-గ్లామర్ పాత్ర చేసింది. ఆమెను అంత అందవికారంగా చూసిన ప్రేక్షకులు షాక్ అయినప్పటికీ ఆమె తన నటనతో అందరినీ ఆకట్టుకొంది. 

అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆమె మళ్ళీ పుష్ప-2తో బిజీ కాబోతోంది కనుక తన అభిమానుల కోసం ఆమె ఓ ఫోటో షూట్‌ చేసి దానిలో తన అందాలను ఒలకబోసి కనువిందు చేసింది. 

‘ఈరోజు నేను బ్లూగా ఫీల్ అవుతున్నానంటూ...’ బ్లూ కలర్ జీన్స్ ధరించి కెమెరాకు ఫోజులిచ్చింది. దానిలో విచిత్రం ఏమీ లేదూ గానీ పైన బ్లౌజ్‌కి బదులు షార్ట్ జీన్స్ ధరించడమే చాలా విచిత్రంగా ఉంది. ముందువైపు ఒక్క బటన్ మాత్రమే పెట్టి చేతులు అడ్డుగా పెట్టుకొని కవర్ చేస్తూ ఫోజ్ ఇచ్చింది. చేతి మణికట్టు కింద ‘ఇర్రీప్లేసబుల్’ (మరో దానితో మార్చలేనిది)అంటూ టాటూ వేయించుకొంది. రష్మిక మందన మరోసారి అందాల ప్రదర్శన చేసి అభిమానుల కోసం దానిని ట్విట్టర్‌లో షేర్ చేసింది.
Related Post

సినిమా స‌మీక్ష