తొలిసారిగా వెబ్‌ సిరీస్‌లో వెంకటేష్-రానా... టీజర్‌ కూడా వచ్చేసింది

September 24, 2022


img

విక్టరీ వెంకటేష్ చాలా మంది హీరోలతో కలిసి మల్టీ స్టార్ సినిమాలు చేశారు కానీ ఇంతవరకు రానాతో ఒక్కటీ చేయలేదు. ఆ లోటు కూడా తీరిపోబోతోంది. అయితే ఇద్దరూ కలిసి సినిమాలో కాకుండా రానా నాయుడు అనే ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. అదీ... హిందీలో. బాలీవుడ్‌ దర్శకులు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ వర్మ ఈ వెబ్‌ సిరీస్‌కు  దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికాలో సూపర్ హిట్ అయిన ‘రే డొనోవాన్’కి హిందీ రీమేక్‌గా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. ఇద్దరూ తెలుగు హీరోలే కనుక దీనిని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడం ఖాయంగానే భావించవచ్చు. ఈ వెబ్‌ సిరీస్‌ టీజర్‌ ఈరోజు విడుదల చేశారు. టీజర్‌ చూస్తే పూర్తి యాక్షన్ ప్యాక్ అని అర్దం అవుతూనే ఉంది. దీనిలో వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా నటిస్తుండటం మరో విశేషం. టీజర్‌లో ఇద్దరూ పోటీ పడుతూ చాలా అద్భుతంగా నటించారు. అతి త్వరలోనే ఇది విడుదలవుతుందని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ప్రకటించింది. 



Related Post

సినిమా స‌మీక్ష