అక్టోబర్ 21న ధమాకా... పేలుతుందా మళ్ళీ తుస్సుమంటుందా?

September 23, 2022


img

ఎంత గొప్ప నటుడికైనా ఓ టైమ్ ఉంటుంది. ఆ టైమ్ వచ్చినప్పుడు, అది నడుస్తున్నప్పుడు ఎవరూ అతనిని ఆపలేరు. కానీ ఆ టైమ్ ముగుస్తున్నప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుత పరిస్థితి ఇదే. మూడు ఫ్లాపులు ఒక సెమీ హిట్ అన్నట్లు సాగుతోంది రవితేజ సినీ ప్రస్థానం. క్రాక్ సినిమాతో మళ్ళీ దారిన పడ్డారనుకొంటే మళ్ళీ ఖిలాడీ, రామారావు ఆన్‌ డ్యూటీ వరుసగా రెండు సినిమాలు దెబ్బేశాయి. వాటి తర్వాత ఇప్పుడు ‘ధమాకా’ అంటూ వస్తున్నాడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో సిద్దమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. కనుక అక్టోబర్‌ 21వ తేదీన విడుదలచేయబోతున్నట్లు సమాచారం. 

ధమాకాలో రవితేజకు జోడీగా పెళ్లి సందడి భామ శ్రీలీల హీరోయిన్‌గా చేసింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. వరుసగా రెండు ఫ్లాపులను వెనకేసుకొన్న రవితేజకు ఈ సినిమా హిట్ అవడం చాలా అవసరం లేకుంటే ఈ ప్రభావం ఆయన తర్వాత చేస్తున్న రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు చిత్రాల మీద పడే ప్రమాదం ఉంటుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర, వంశీ కృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర రావు చేస్తున్నాడు.


Related Post

సినిమా స‌మీక్ష