ఆర్‌ఆర్‌ఆర్‌లో విలన్ ఒక్కరే కదా? రాజమౌళి

September 23, 2022


img

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై ఆరు నెలలైన తర్వాత ఇప్పుడు మళ్ళీ వార్తలలో నిలుస్తుండటం విశేషం. రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఇప్పుడు వివాదాలలో చిక్కుకొంటోంది. ఆ సినిమాలో బ్రిటిష్ వాళ్ళని చెడ్డవాళ్ళన్నట్లు చూపారంటూ సోషల్ మీడియాలో కొందరు బ్రిటన్ పౌరులు విమర్శలు గుప్పించారు. 

వాటిపై స్పందించిన రాజమౌళి, “ఈ సినిమాలో ఓ బ్రిటన్ నటుడు విలన్‌గా నటిస్తే దానార్ధం బ్రిటన్‌లో ప్రజలందరూ చెడ్డవాళ్ళని కాదు. ఈవిషయం సినిమా చూసిన ప్రేక్షకులకు తెలుసు. ఈ సినిమాలో నా హీరోలు భారతీయులు. వారి ప్రతినాయకులు బ్రిటన్‌కు చెందిన నటులు మాత్రమే. ఓ సినిమాలో ఫలాన నటుడు హీరో, ఫలానా నటుడు విలన్ అని ప్రేక్షకులు అర్దం చేసుకోగలరు కానీ వారికి సినిమాకి సంబందించిన అన్ని అంశాలపై అవగాహన ఉండదు. కానీ సినిమాలోని భావోద్వేగాలను ప్రేక్షకులు బాగా అర్దం చేసుకోగలరు. అది చాలు. కానీ ఓ కధా రచయిత సినిమాకి సంబందించిన అన్ని అంశాలపై అర్దం చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి ఇక ఆలోచించనవసరం లేదు. అయినా ఇది చరిత్ర కాదు ఓ కల్పిత కధ మాత్రమే. సినిమా ప్రారంభానికి ముందే ‘డిస్‌క్లెయిమర్’ లో ఆ విషయం స్పష్టంగా చెప్పాము కూడా. కనుక ఎవరినో అవమానించేందుకు తీసినట్లు భావించడం సరికాదు,” అని అన్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష