అప్పటిలా గుర్రం ఎక్కలేకపోతున్నా: కాజల్ అగర్వాల్

September 22, 2022


img

పెళ్ళి తర్వాత కాజల్ అగర్వాల్ వివాహ జీవితాన్ని, ఆ తర్వాత మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ హాయిగా గడిపేస్తూ సినిమాలకు దూరం అయ్యారు. ఆమె గర్భంలోని బిడ్డ తన తల్లిని మొదటి ఇన్నింగ్స్‌లో చివరి బంతి (ఆచార్య)లో నాట్ అవుట్ కాకుండా కాపాడాడని చెప్పవచ్చు. లేకుంటే ఆచార్య సినిమా ఫెయిల్యూర్‌లో కాజల్‌ అగర్వాల్‌  వాటా కూడా ఉండేది. 

ఇప్పుడు ఆమె మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నానని స్వయంగా చెప్పారు. అయితే తల్లినైన తర్వాత ఇప్పుడు తన శరీరం గతంలో ఉన్నట్లు లేదనిపిస్తోందని, గతంలోలాగా శరీరం తనకు సహకరించడం లేదని అన్నారు. శరీరాన్ని మార్చుకోవాలంటే మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాలని కాజల్ అన్నారు. 

తల్లిని కాక మునుపు నేను చాలా ఎక్కువ గంటలు కష్టపడి పనిచేయగలిగేదానిని  కానీ ఇప్పుడు గుర్రం ఎక్కాలన్నా స్వారీ చేయాలన్నా కొంచెం కష్టంగా ఉంటోంది. గతంలో చాలా సులువుగా మార్షల్ ఆర్ట్స్ లో పాల్గొనే దానిని. కానీ ఇప్పుడు కాస్త శ్రమకే అలసిపోతున్నాను. అయితే పట్టుదలతో కష్టపడి శ్రమిస్తే సాధ్యం కానిదేమీ ఉండదని నమ్ముతున్నాను,” అని ట్వీట్ చేశారు. 

దాంతో పాటు ఆమె గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను, జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఫోటోలు వీడియోలను కోడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే తన చిన్నారి బాబు ఫోటోలను కూడా కాజల్ అగర్వాల్ షేర్ చేశారు.

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2లో ఆమె నటించబోతున్న సంగతి తెలిసిందే. దాని కోసం ఆమె తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకొని మునుపటిలా నాజూకుగా మారి, మళ్ళీ ఇదివరకులా సెట్స్ లో కష్టపడి పనిచేసేందుకు వీలుగా శక్తిని కూడగట్టుకొనేందుకు ప్రయత్నిస్తుండటం ఆ వీడియోలో చూడవచ్చు.    Related Post

సినిమా స‌మీక్ష