తార్‌మార్ తక్కడ్ మార్... పాటా... పట్టాలపై పరిగెడుతున్న రైలుబండి చప్పుడా?

September 21, 2022


img

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన గాడ్ ఫాదర్‌ సినిమా అక్టోబర్‌ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన తార్ మార్ తకడ్ మార్ అంటూ సాగే ఈ పాట మేకింగ్ వీడియోను ఈరోజు విడుదల చేశారు. ఈ లిరికల్ వీడియోలో చిరంజీవి, బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్ చేసిన డ్యాన్స్ క్లిప్ మరికొంత చూపారు. ఇద్దరు హీరోలకు కాస్త వయసు ఎక్కువ ఉన్నందునో ఏమో ప్రభుదేవా వారికి పెద్దగా కదలికలు లేకుండా, ఇబ్బంది పడకుండా ఉండేవిదంగా డాన్స్ కంపోజ్ చేసినట్లున్నారు. పాట, సంగీతం కూడా ఏదో వంతెన మీద నుంచి రైలుబండి వెళుతున్నట్లు అనిపిస్తోంది తప్ప ఇద్దరు మెగాహీరోలకు తగ్గట్లులేదనిపిస్తుంది. ఈ పాట, మ్యూజిక్, వారి డాన్స్‌లను సగం సగం చూసి అంచనా వేయడం సరికాదు కనుక థియేటర్లలో చూశాక తెలుస్తుంది. అనంత్ శ్రీరామ్ వ్రాసిన పాటను శ్రేయా గోషల్ పాడగా దానికి తమన్ సంగీతం అందించారు. 

మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. రామ్ చరణ్‌, ఆర్‌బీ.చౌదరి కలిసి ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఈనెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు అనంతపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు.Related Post

సినిమా స‌మీక్ష