ఆస్కార్ రేసు నుంచి ఆర్ఆర్ఆర్ అవుట్!

September 21, 2022


img

ఈసారి భారత్‌ నుంచి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులకు ఆర్ఆర్ఆర్ మూవీ వెళ్ళబోతోందనే వార్తలు చూసి ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ అభిమానులే కాదు... రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ చాలా సంతోషించారు. బాహుబలి తర్వాత విడుదలైన ఆర్ఆర్ఆర్ కూడా దేశవ్యాప్తంగా, విదేశాలలో కూడా సూపర్ హిట్ అయ్యింది. సుమారు రూ.1,000 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, నటీనటుల నటన, సంగీతం, కెమెరా, గ్రాఫిక్స్ ఇలా ప్రతీ అంశంలో ఆర్ఆర్ఆర్ చిత్రం దేశవిదేశీ సినిమాలతో పోటీ పడే స్థాయిలో రాజమౌళి ఎంతో శ్రద్దగా తీశారు. కనుక ఈ సినిమా ఆస్కార్ అవార్డు నామినేషనేట్ అయితే తప్పకుండా అవార్డు గెలుచుకొంటుందనే నమ్మకం దేశప్రజలలో వ్యక్తం అయింది. కానీ ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను పక్కన పెట్టేసి ఎవరికీ తెలియని గుజరాతీ సినిమా ‘ఛేల్లో షోని’ని నామినేట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. 

ఆర్ఆర్ఆర్‌ని కాదని ఆ సినిమాను నామినేట్ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్ళు ఉండి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలు గుజరాత్‌ రాష్ట్రానికి చెందినవారు కనుక ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియాలో నామినేషన్ కమిటీ సభ్యులలో కొందరు వారి మెప్పు పొందేందుకు ఈ గుజరాతీ సినిమాను ఎంపిక చేసి ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనలు నిజమో కాదో తెలీదు. ఆ సినిమా ఆస్కార్ అవార్డ్ తెస్తుందో లేదో తెలీదు కానీ తప్పకుండా ఒక్క ఆస్కార్ అవార్డునైనా సాధించగల సత్తా ఉన్న ఆర్ఆర్ఆర్‌ సినిమాను దాని కోసం పక్కన పెట్టేయడం నిజమైతే భారత్‌ సినీ పరిశ్రమ ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్లు చెప్పవచ్చు. 


Related Post

సినిమా స‌మీక్ష