డిసెంబర్‌ 2న వస్తున్న ధనుష్ సార్

September 19, 2022


img

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాకు తెలుగులో ‘సార్’ తమిళంలో ‘వాతి’ అని టైటిల్స్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవల ధనుష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ అందరినీ చాలా ఆకట్టుకొంది. మన దేశంలో విద్యావ్యవస్థ తీరుతెన్నులు ఈ సినిమా కధాంశమని టీజర్‌ ద్వారా చూచాయగా తెలుస్తోంది.

ఈ సినిమాలో సంయుక్తా మీనన్, తనికెళ్ళ భరణి, సాయి కుమార్, సముద్రఖని, తోటపల్లి మధు, హైపర్ ఆది తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. 

డిసెంబర్‌ 2వ తేదీనే అడవి శేష్, నాని నటించిన హిట్-2 సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. కనుక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.Related Post

సినిమా స‌మీక్ష