ఎయిర్ ఫోర్స్‌ కధాంశంతో వరుణ్ తేజ్

September 19, 2022


img

గని సినిమాతో ఎదురుదెబ్బ తిన్న వరుణ్ తేజ్‌కి ఎఫ్-3 విజయం చాలా ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు. దాని తర్వాత ఇప్పుడు భారత్‌ వాయుసేన చేసిన ఓ యుద్ధం కధాంశంగా వరుణ్ తేజ్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్‌ ఫైటర్ ప్లేన్ పైలట్‌గా చేయబోతున్నట్లు తాజా పోస్టర్‌లో చూపారు. దానిలో  అవధులు లేని ధైర్యసాహసాలు, శౌర్యం పట్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబరాలు చేసుకోబోతుంది. ఆకాశంలో జరిగే యుద్ధాన్ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు సిద్ధంగా ఉండండి. త్వరలో టేకాఫ్‌కు సిద్ధం అవుతుంది అని కింద వ్రాసి ఉంది. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ & రెనైసెన్స్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబందించి మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమా టేకాఫ్ చాలా బాగుంది కానీ ఎలా ఎగురుతుందో, ఎలా  ల్యాండింగ్ అవుతుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష