ఈ వారంలో థియేటర్లలో ఏడు సినిమాలు రిలీజ్... పండగే!

September 13, 2022


img

ఈ వారంలో ఏడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అంటే సగటున రోజుకో సినిమా అనుకోవచ్చు. ఈ నెల 15వ తేదీన ది లైఫ్ ఆఫ్ ముత్తు (తెలుగు వెర్షన్‌) విడుదల కాబోతోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మేనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ స్టార్ శింబు, సిద్ధి ఇద్నాని, రాధిక, సిద్ధిఖ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. 

ఈ నెల 16వ తేదీన ఒకేసారి శాకినీ డాకినీ, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, సకల గుణాభిరామ, కె3-కోటికొక్కడు, నేను c/o నువ్వు, నేను మీకు బాగా కావల్సినవాడిని, అం/అః సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. 

శాకినీ డాకినీ: ఈ సినిమాలో రెజినా, నివేదా ధామస్ ప్రధాన పాత్రలలో నటించారు. దర్శకత్వం:  సుధీర్ వర్మ, సంగీత దర్శకత్వం: మిక్కీ జే మేయర్. 

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సుధీర్ బాబు, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా చేసారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు.   

సకల గుణాభిరామ: వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో విజే సన్నీ, శ్రీతేజ్, ఆషిమా నర్వాల్, చమ్మక్ చంద్రలు ప్రధాన పాత్రలు చేశారు.   

కె3-కోటికొక్కడు: శివ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సుదీప్, మడోనా సెబాస్టియన్, శ్రద్దా దాస్, అఫ్తాబ్, రవిశంకర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. దీనికి అర్జున్ జన్య సంగీతం అందించారు.

నేను c/o నువ్వు: 1980లో జరిగిన ఓ యాధార్ద ప్రేమ కధ ఆదారంగా తీసిన ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం సాగారెడ్డి తుమ్మ, సంగీతం: ఎన్ఆర్ రఘునాధం అందించారు. ఈ సినిమాలో ధనరాజ్, రత్న కిషోర్, సాగారెడ్డి ప్రధాన పాత్రలలో నటించారు. 

నేను మీకు బాగా కావల్సినవాడిని: నటీనటులు కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ తదితరులు. దర్శకత్వం: శ్రీదర్ గాదె, సంగీతం: మణిశర్మ.  

అం/అః: ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న శ్యామ్ మండల గత 13 ఏళ్ళుగా సీనియర్ దర్శకులు వైవిఎస్ చౌదరి, గుణశేఖర్, సురేందర్ రెడ్డి వద్ద పనిచేసి కధ, దర్శకత్వం, స్క్రీన్-ప్లే అన్నిటిపై పట్టు సాధించారు. సుధాకర్, లావణ్య, సిరి కనకాల హీరో హీరోయిన్లుగా నటించారు. 


Related Post

సినిమా స‌మీక్ష