యశోద కోసం సమంత భారీ పారితోషికం?

September 10, 2022


img

సమంత ఏదైనా సినిమా చేస్తోందంటే అది తప్పకుండా హిట్ అవుతుందని చెప్పవచ్చు. సమంత ఎంత గొప్పగా నటించి మెప్పిస్తుందో బోల్డ్ సీన్స్ చేసేందుకు కూడా వెనకాడదు. ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఫ్యామిలీ మ్యాన్-2లో ఆమె నటన, బోల్డ్ సీన్స్ ఇందుకు నిదర్శనం. అందుకే సమంతకు సినీ ఇండస్ట్రీలో అంత డిమాండ్. ప్రస్తుతం ఆమె హరి-హరీష్ దర్శకత్వంలో యశోద అనే థ్రిల్లర్ మొవీ చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు సమంత కేవలం 50 రోజులకే కాల్షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ పారితోషికం మాత్రం గట్టిగానే తీసుకొన్నట్లు సమాచారం. ఈ సినిమాకి ఆమె రూ.2.75 కోట్లు తీసుకొన్నట్లు తెలుస్తోంది. అసలు హీరోయిన్లలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకొనేవారు తెలుగు సినీ పరిశ్రమలో అయితే ఎవరూ లేరనే చెప్పవచ్చు. 

శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ దీనిని తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. యశోద టీజర్‌ శుక్రవారం విడుదల చేశారు. 

యశోద తెలుగు వెర్షన్‌కు మణిశర్మ సంగీతం, ఎం.సుకుమార్ కెమెరా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, డా.చల్లా భాగ్యలక్ష్మి, చిన్న నారాయణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు అందిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష