అమెజాన్ ప్రైమ్‌లో సూపర్ హిట్ మూవీ సీతారామం

September 09, 2022


img

సల్మాన్ దుల్కర్, మృణాళ్ ఠాకూర్ ప్రధాన పాత్రలలో ఆగస్ట్ 5న విడుదలైన సీతారామం ఇటీవల కాలంలో విడుదలైన చక్కటి సినిమాలలో ఒకటిగా పేరు తెచ్చుకొని నేటికీ థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.80 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టిస్తోంది. ఇప్పుడు ఓటీటీలో కూడా విడుదలైంది. గురువారం రాత్రి నుంచి సీతారామం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన, సుమంత్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు చేశారు. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్, ఆయన కుమార్తె స్వప్నదత్ కలిసి ఈ సినిమాను తమ వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ బ్యానర్‌లపై నిర్మించారు.  Related Post

సినిమా స‌మీక్ష