థాంక్యూ చెప్పినా ప్రేక్షకులు కనికరించలేదు అందుకే

August 09, 2022


img

విక్రమ్ దర్శకత్వంలో నాగ చైతన్య, రాశీ ఖన్నా, అవికా గోర్‌, మాళవికా నాయర్‌ ప్రధాన పాత్రలలో చేసిన థాంక్యూ సినిమా జూలై 22న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాలో హీరో నాగ చైతన్య, నిర్మాత దిల్‌ రాజు ఎంతమందికి ముందుగానే థాంక్స్ చెప్పుకొన్నప్పటికీ, కధలో బలం లేకపోవడంతో బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది. కనుక మూడు వారాలు గడవక మునుపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 11 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుందని ఆ సంస్థ స్వయంగా ట్విట్టర్‌లో తెలియజేసింది. ఈ సందర్భంగా అమెజాన్ ప్రైమ్‌ మరో కొత్త ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది. 

శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని కుటుంబానికి ‘మనం’ వంటి మరుపురాని క్లాసిక్ హిట్ అందించిన విక్రమ్, ఈ సినిమాతో వారి కుటుంబాన్ని చాలా నిరాశపరిచారని చెప్పక తప్పదు.  Related Post

సినిమా స‌మీక్ష