బింబిసార సీతారామాన్ని కూడా విడిచిపెట్టలేదు

August 06, 2022


img

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రంలో బింబిసార అతి క్రూరుడు. పసిపిల్లలను సైతం చంపడానికి వెనకాడడు. అటువంటిది ప్రేమజంట సీతారామంను విడిచిపెడతాడనుకోవడం అత్యశే అవుతుంది. రెండు సినిమాలు శుక్రవారం విడుదలయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొన్నాయి. అయితే సీతారామం క్లాసిక్ లవ్ స్టోరీ కావడంతో మాస్ ఆడియన్స్‌ని బింబిసార ఎత్తుకుపోయాడు. ఏ సెంటర్లలో సీతారామం బాగానే ఆడుతోంది కానీ బీ,సీ సెంటర్లలో బింబిసారతో యుద్ధం చేయలేక చతికిలపడుతున్నాడు. దీంతో ఏ సెంటర్లలో వచ్చిన కలెక్షన్లతో సంతృప్తి చెందాల్సి వస్తోంది.  

సీతారామం ప్రీ-బిజినెస్ రూ.16.20 కోట్లు కనుక నష్టపోకుండా బయటపడాలంటే కనీసం రూ.17 కోట్లు సాధించాల్సి ఉంటుంది. ఆగస్ట్ 13న నిఖిల్ నటించిన కార్తికేయ, ఆగస్ట్ 25న విజయ్ దేవరకొండ నటించిన లైగర్ వచ్చేస్తున్నాయి. కనుక ఆలోగా రూ.17 కోట్లు టార్గెట్ సాధించాల్సి ఉంటుంది. లెఫ్టినెంట్ రామ్ ఈ పరీక్షలో నెగ్గుతాడో లేదో చూడాలి. 


Related Post

సినిమా స‌మీక్ష