లైగర్ రొమాన్స్ ... మామూలుగా లేదుగా

August 06, 2022


img

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్ సినిమా ఈనెల 25న విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్ చాలా జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో ‘దేనికైనా పిల్లి పిల్లగాడూ... అంటూ హీరోహీరోయిన్ల మద్య సాగే రొమాంటిక్ సాంగ్ విడుదల చేసింది చిత్ర బృందం. విజయ్ దేవరకొండ తల్లిగా నటిస్తున్న రమ్యకృష్ణ “బాబోయ్ మామూలు డ్రామాలు కావు.. అన్ని లెక్కలేసుకొని నువ్వు బకరా అని ఫిక్స్ అయినంక నంబర్ ఇస్తయ్. ఇక వాట్సప్‌లు షురూ ఐతై చూడు... నిద్రపోనివ్వవు... పనులు చేసుకొనివ్వవు...బతుకంతా వాళ్ళకు రాసిచ్చేసినట్లే...” అంటూ చెప్పిన డైలాగులతో మొదలయిన సాంగ్ సీక్వెన్స్‌లో చాటుగా వచ్చిన హీరోయిన్‌ హీరోతో రొమాన్స్ మొదలుపెట్టడంతో పాట మొదలయి హాట్ హాట్‌గా సాగిపోతుంది. 

పాన్ ఇండియా మూవీగా వస్తున్న లైగర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మిస్తున్న లైగర్‌లో రమ్యకృష్ణ, విష్ణురెడ్డి, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్ పాండే, రోనిత్ రాయ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఆగస్ట్ 25న లైగర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. Related Post

సినిమా స‌మీక్ష