రేపు 4 గంటలకు ట్విట్టర్‌లో లైగర్ సాంగ్

August 04, 2022


img

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న లైగర్ సినిమా ఆగస్ట్ 25న విడుదల కాబోతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడు పెంచింది చిత్ర బృందం. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ట్విట్టర్‌లో లైగర్ నుంచి మరో పాట విడుదల చేయబోతున్నట్లు విజయ్ దేవరకొండ ఈరోజు ట్విట్టర్‌ ద్వారానే తెలియజేశాడు. “తల్లీకొడుకుల మద్యలో ఓ అందమైన డ్రామా క్వీన్ ఎప్పుడూ ఉంటుంది,” అంటూ చిన్న వీడియో క్లిప్పును కూడా షేర్ చేశాడు. దానిలో హీరోయిన్ అనన్య పాండే విజయ్ దేవరకొండకు ‘లోనికి వస్తానంటూ..’  సైగలు చేస్తుండటం, ఆమెను చూసి అతను కంగారుగా ‘వద్దువద్దు వెళ్లిపో...’ అన్నట్లు చేత్తో సైగలు చేయడం చాలా చక్కగా ఉంది. 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సిద్దమవుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కిక్ బాక్సరుగా అంతర్జాతీయ పోటీలలో పాల్గొని ఛాంపియన్‌గా ఎలా నిలిచాడు? అనేది కధాంశం. లైగర్‌లో ప్రముఖ అంతర్జాతీయ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నారు. 

పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి లైగర్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ తల్లిగా నటిస్తున్నారు. ఇంకా విష్ణురెడ్డి, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్ పాండే, రోనిత్ రాయ్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడు.    


Related Post

సినిమా స‌మీక్ష