బన్నీ.. మరో వాణిజ్య ప్రకటన మరో స్టైల్!

August 03, 2022


img

అల్లు అర్జున్‌ స్టైలిష్ స్టార్ అని ఊరికే అనలేదని ఈ తాజా ఫోటో చూస్తే అర్దమవుతుంది. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ దర్శకత్వంలో రెండు వాణిజ్య ప్రకటనలలో డిఫరెంట్ గెటప్‌లలో కనిపించి అభిమానులకు సంతోషం కలిగించిన అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మరో వాణిజ్య ప్రకటనలలో మరో గెటప్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. పుష్పలో ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా చాలా రఫ్‌గా కనిపించిన అల్లు అర్జున్ ఈ ప్రకటనలో చాలా స్టయిలిష్గా కనిపించాడు. ఈ వాణిజ్య ప్రకటనను చిత్రీకరించిన రత్నవేలు ట్విట్టర్‌లో ఆ ఫోటో షేర్ చేస్తూ, "సుమారు 18 ఏళ్ళ కతర్వాత మేము ముగ్గురం కలిసి ఓ ఫోటో షూట్‌లో పాల్గొన్నాం. బన్నీ, సుకుమార్‌ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది," అని పేర్కొన్నాడు.

పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అనసూయ, సునీల్ పాత్రలు మరింత కరుకుదనంతో ఉంటాయని తెలుస్తోంది. Related Post

సినిమా స‌మీక్ష