ఓటీటీలో పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్‌డే

August 02, 2022


img

సినిమా హిట్టైనా... ఫట్టైనా తరువాత తేలేది ఓటీటీలోనే. కనుక మారుతి దర్శకత్వంలో గోపీ చంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన పక్కా కమర్షియల్, రితేష్ రానా దర్శకత్వంలో లావన్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో వచ్చిన హ్యాపీ బర్త్‌డే చిత్రాలు ఈ వారం ఆహా, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలలో వచ్చేస్తున్నాయి. 

పక్కా కమర్షియల్ చిత్రానికి మారుతి దర్శకుడు కావడంతో భారీ అంచనాల మద్య జూలై 1న థియేటర్లలో విడుదలైంది. కానీ బోర్లాపడి ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వస్తోంది. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆహాలో ప్రసారం కానుంది. సీమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మారుతీ మార్క్ కామెడీ కోసం పక్కా కమర్షియల్ చిత్రాన్ని ఓసారి ఓటీటీలో చూసేయొచ్చు.     

రితేష్ రానా దర్శకత్వంలో లావన్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో వచ్చిన హ్యాపీ బర్త్‌డే చిత్రం జూలై 8న థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే కొంచెం గందరగోళంగా ఉండటంతో బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది. కనుక హ్యాపీ బర్త్‌డే కూడా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, న‌రేష్ అగ‌స్త్య‌, గెట‌ప్ శ్రీను, స‌త్య‌ ముఖ్యపాత్రలు చేశారు. ఆగస్ట్ 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హ్యాపీ బర్త్‌డే చిత్రం ప్రసారం కానుంది.


Related Post

సినిమా స‌మీక్ష