ధనుష్ సార్ ఫస్ట్ లుక్... డీసెంట్!

July 28, 2022


img

కోలీవుడ్ అగ్రహీరోలలో ఒకరైన ధనుష్ విభిన్నమైన కధాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొన్నారు. ధనుష్ తమిళ సినిమాలు తెలుగులో చాలా డబ్బింగ్ చేసి విడుదల చేసినందున తెలుగు ప్రజలకు కూడా సుపరిచితుడే. ఇప్పుడు ధనుష్ తెలుగులోనే ‘సార్’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ఈరోజు ధనుష్ పుట్టినరోజు కావడంతో ‘సార్’ సినిమాలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విద్యావ్యవస్థ నేపధ్యంలో తీస్తున్న ఈ సినిమాలో ధనుష్ లెక్చరర్‌గా నటిస్తున్నారని దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. 

ఈ సినిమాలో ధనుష్కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇంకా  సాయి కుమార్, తనికెళ్ళ భరణి, సముద్రఖని, హైపర్ ఆది, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్త్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: యువరాజ్, ఎడిటింగ్: నవీన్ నూలి. 


Related Post

సినిమా స‌మీక్ష