ఇకపై థియేటర్లకి ఓటీటీలకు మద్య 10 వారాలు గ్యాప్

July 26, 2022


img

తెలుగు సినీ నిర్మాతల మండలి ఈరోజు హైదరాబాద్‌లోని ఫిలిమ్ ఛాంబర్‌లో సమావేశమయ్యి కీలక నిర్ణయాలు తీసుకొంది. 

ఇక నుంచి భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన 10 వారాల తరువాతే ఓటీటీలలో విడుదల చేయాలి.  

రూ.6 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలను ఎన్ని వారాల తరువాత ఓటీటీలో విడుదల చేయాలనే దానిపై ఫిలిమ్ ఫెడరేషన్‌తో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోబడుతుంది.    

అంతకంటే చిన్న బడ్జెట్ సినిమాలు 4 వారాల తరువాత ఓటీటీలలో విడుదల చేసుకోవచ్చు. 

సినిమాల ప్రదర్శనకు వర్చువల్ ప్రింట్ ఫీజు అంటే పోస్టర్లు, ఫ్లెక్సీ బ్యానర్లు వగైరాల ఖర్చును ఎగ్జిబిటర్లే భరిచాల్సి ఉంటుంది. 

నగరాలు, పట్టణాలలో సాధారణ థియేటర్లు, సీ-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు జీఎస్టీతో కలిపి రూ.100, రూ.70 మాత్రమే వసూలు చేయాలి. మల్టీప్లెక్స్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.125 మాత్రమే వసూలు చేయాలి. 

మీడియం బడ్జెట్, మీడియం లెవెల్ హీరోల సినిమాలకు నగరాలు, పట్టణాలలో సాధారణ థియేటర్లలో టికెట్ ధరలు రూ.100+జీఎస్టీ, సీ-క్లాస్ సెంటర్లలో జీఎస్టీతో కలిపి రూ.100 మాత్రమే వసూలు చేయాలి. మల్టీప్లెక్స్ థియేటర్లలో గరిష్టంగా రూ.150+ జీఎస్టీ మాత్రమే వసూలు చేయాలి.

నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న కారణంగా ఇండస్ట్రీలో మేనేజర్లు, కో-ఆర్డినేటర్ల వ్యవస్థ రద్దుకు నిర్మాతల మండలి సిఫార్సు చేసింది.  

ఇకపై నటీనటుల సహాయకులకు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించబడదు. నటీనటులు తమకు లభించిన పారితోషికం నుచే సహాయకుల ఖర్చులు భరించాల్సి ఉంటుంది. 

సినీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి సమావేశమయ్యి చర్చించి నిర్ణయాలు తీసుకోబడతాయి. 



Related Post

సినిమా స‌మీక్ష