సీతారామం టీజర్‌ విడుదల

June 25, 2022


img

సల్మాన్ దుల్కర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం  సినిమా టీజర్‌ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకు ‘యుద్ధంతో వ్రాసిన ఓ ప్రేమ కధ’ ట్యాగ్ లైన్. దీనికి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. సీతారామంలో సుమంత్, రష్మిక మందన ముఖ్యపాత్రలు చేశారు.

టీజర్‌ చాలా విభిన్నంగా ఆకట్టుకొనేలా ఉంది. “ఆకాశవాణి. ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం. లెఫ్టినెంట్ రామ్ నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్నా ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడాటానికి ఒక కుటుంబం కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది...” అంటూ సీత పాత్రధారి సంభాషణతో టీజర్‌ మొదలవుతుంది. 1965లో ఓ సైనికుడి ప్రేమ కధను సీతారామంగా దర్శకుడు హనూ రాఘవపూడి చాలా చక్కగా మలిచినట్లు టీజర్‌తో అర్ధం అవుతుంది.  వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ కలిసి నిర్మిస్తున్న సీతారామం ఆగస్ట్ 5వ తేదీన విడుదల కాబోతోంది.Related Post

సినిమా స‌మీక్ష