సావిత్రమ్మ కష్టాలు చూసిన తరువాతే జ్ఞానోదయం అయ్యింది

June 25, 2022


img

తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమే అవసరం లేని నటి వై.విజయ. ఆమె 1961 నుంచి తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కలిపి సుమారు 1,000కి పైగా సినిమాలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆనాటి అగ్రహీరోలందరితో ఆమె నటించారు. అయితే ఎన్ని సినిమాలు చేసినా, చేస్తున్నా ముందుచూపు లేకుండా వాటిపై వచ్చే ఆదాయాన్ని ఖర్చుపెట్టుకొంటూ పోతే చివరికి ఎవరూ ఆదుకోరని సావిత్రమ్మ కష్టాలు చూసిన తరువాత అర్దమైందని వై.విజయ చెప్పారు. 

అయితే మంచి ఆదాయం వస్తున్నప్పుడు దానిని ఏవిదంగా భవిష్యత్‌ కోసం పెట్టుబడిగా మార్చుకోవాలో తాను విజయశాంతి దగ్గరే నేర్చుకొన్నానని లేకుంటే ఈరోజు తాను కూడా రోడ్డున పడేదానినని అన్నారు. షూటింగ్ విరామ సమయంలో విజయశాంతితో కబుర్లు చెపుతున్నప్పుడు ఆమె పెట్టుబడుల గురించి అనేక విషయాలు చెప్పేదని వై.విజయ చెప్పారు. 

ఆమె సూచనల మేరకు ముందుగా చెన్నైలో ఉండేందుకు ఓ ఇల్లు కట్టుకొన్నాక, తంజావూరులో ఓ కళ్యాణమండపం, ఓ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి అద్దెలకు ఇచ్చామని వై.విజయ చెప్పారు. ఆ తరువాత క్రమంగా సినిమాలపై వచ్చే ఆదాయం తగ్గినా, తమ కుటుంబం వాటిపై వచ్చే అద్దెలతో ఉన్నంతలో సుఖంగా జీవనం సాగించగలుగుతున్నామని చెప్పారు. 

మళ్ళీ చాలా రోజుల తరువాత ఎఫ్-2, ఎఫ్-3 తెలుగు సినిమాలలో నటించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక ముందు కూడా తనకు తగిన పాత్రలు లభిస్తే నటించడానికి సిద్దంగా ఉన్నానని వై.విజయ అన్నారు.


Related Post

సినిమా స‌మీక్ష