సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 154 చిత్రం రిలీజ్

June 24, 2022


img

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తరువాత భోళా శంకర్‌, గాడ్ ఫాదర్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటి తరువాత ఆయన 154వ చిత్రానికి సంబందించి కూడా తాజా అప్‌తాజా అప్‌డేట్స్ వచ్చేసింది. బాబి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రుతీ హాసన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాతికి విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. దానిలో చిరంజీవి లంగరు పట్టుకొని ఉన్నట్లు చూపారు. పైన ‘కలుద్దాం సంక్రాంతికి 2023’ అంటూ సంక్రాంతికి విడుదల కాబోతోందని తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్‌లో ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ, ‘బాక్సాఫీసు వేటకు లంగరు తయారు’ అని ట్వీట్ చేసింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. Related Post

సినిమా స‌మీక్ష