ఆ సినిమా పేరు: ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా

June 23, 2022


img

సినిమాలో పాపులర్ అయిన పాటలను, డైలాగ్స్‌ను అందరూ సందర్భోచితంగా వాడేసుకోవడం చాలా సాధారణమే. అలాగే కొన్నిసార్లు పాపులర్ సినిమా పాటలలో మొదటి చరణాలను టైటిల్‌గా చేసుకొని ‘లాహిరి లాహిరిలో..’ వంటి సినిమాలు కూడా చాలానే వచ్చాయి. ఇప్పుడు అదే కోవలో అల్లు అర్జున్, రష్మిక మందనల సూపర్ హిట్ మూవీ పుష్పలో సూపర్ హిట్ సాంగ్‌ ‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ టైటిల్‌తో ఓ సినిమా వస్తోంది. 

రేలంగి నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జబర్దస్త్ రాకింగ్ రాకేశ్, అనన్య, హిందోళా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై తుమ్మల ప్రసన్నకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. సినిమాలో రెండు పాటలు చిత్రీకరణ కోసం చిత్ర బృందం కశ్మీరుకి బయలుదేరే ముందు ఈ సినిమా టైటిల్ ప్రకటించింది. 

ఈ సందర్భంగా దర్శకుడు రేలంగి నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ, “ఇది హర్రర్ కామెడీ మూవీ. ఇప్పటివరకు వచ్చిన ఇటువంటి సినిమాలకు పూర్తి భిన్నంగా అందరినీ ఆక్కటుకొనేలా ఉంటుంది. కశ్మీరులో రెండు పాటల చిత్రీకరణ పూర్తిచేసి జూలై నెలాఖరులో సినిమాను రిలీజ్ చేయబోతున్నాము,” అని చెప్పారు.


Related Post

సినిమా స‌మీక్ష