నాగ చైతన్య కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం

June 23, 2022


img

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న కొత్త సినిమాకు నేడు హైదరాబాద్‌ అన్నపూర్ణా స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం నాగ చైతన్య, కృతిశెట్టిలపై ముహూర్తం షాట్‌కు దర్శకుడు బోయపాటి క్లాప్ కొట్టగా, రానా కెమెరా స్వీచ్చాన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు భారతి రాజా, శివ కార్తికేయన్, బోయపాటి, దగ్గుబాటి అతిధులుగా హాజరయ్యారు. పేరు ఇంకా ఖరారు చేయని ఈ సినిమాను శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు. 

నాగ చైతన్య నటించిన రెండు సినిమాలు థాంక్యూ, లాల్ సింగ్‌ చడ్డాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వాటిలో విక్రమ్ కుమార్‌ దర్శకత్వం వహించిన థాంక్యూ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక అయ్యర్ ఆవికా గోర్, తమిళిసై సౌందరరాజన్‌ సుశాంత్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 8వ తేదీన విడుదల కాబోతోంది. 

లాల్ సింగ్‌ చడ్డా హిందీ సినిమా. దీనిలో అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్‌ నటిస్తున్నారు. అడ్వైట్ చందన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ 11వ తేదీన విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష