అంటే సుందరానికి నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి అంటే...

June 22, 2022


img

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా నటించిన ‘అంటే సుందరానికి’ నాని మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఈనెల 10న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ తెచ్చుకొంది కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కనుక ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. జూలై 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అంటే సుందరానికి ప్రసారం కానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లో అదే రోజున విడుదల కానుంది. 

సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ అంటే నానికి క్రీస్టియన్ మతస్థురాలైన తన బాల్య స్నేహిరాలు లీల (నజ్రియా) అంటే చాలా ఇష్టం. ఆమెకు కూడా నాని అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి చదువుకొన్న వారిద్దరు పెద్దయ్యాక మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డాక పెళ్ళి చేసుకోవాలనుకొంటారు. ఈ నేపధ్యంలో నాని అంటే సుందరం, లీలలు వేరే మతం అంటే బొత్తిగా గిట్టని తమ తల్లితండ్రులను, ముఖ్యంగా శాస్త్రి (నరేష్), థామస్ (ఆజఘామ్ పెరుమాళ్)లను ఏవిదంగా ఒప్పించారు? అనేది కధాంశం. 

ఇది నాని మార్క్ కామెడీ సినిమా కనుక కడుపుబ్బ నవ్విస్తుంది. అదే సమయంలో రెండు మతాలకు చెందిన పెద్దల మద్య జరిగే ఘర్షణ సినిమాలో భావోద్వేగాలను కూడా జోడించింది. 


Related Post

సినిమా స‌మీక్ష