బ్యాంకులు నిండకపోయినా కంచాలు నిండుతున్నాయి: నరేష్

June 22, 2022


img

తెలుగు సినీ పరిశ్రమలో నేటి నుంచి ఆకస్మికంగా మొదలైన కార్మికుల సమ్మెపై సీనియర్ నటుడు నరేష్ స్పందిస్తూ, “కరోనా కష్టకాలం సినీ కార్మికులు పస్తులున్నారు. కరోనా సోకి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బు లేక అల్లాడారు. సినిమా షూటింగులు నిలిచిపోవడంతో నిర్మాతలు కూడా తీవ్రంగా అష్టపోయారు.   కరోనా దెబ్బతో గత మూడేళ్ళుగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కొలుకొంటోంది. కనుక ఈ సమయంలో సినీ కార్మికులు హటాత్తుగా సమ్మె చేయడం సరికాదు. ప్రస్తుతం బ్యాంకులు నిండకపోయినా మనందరి కంచాలు నిండుతున్నందుకు చాలా సంతోషించాలి. జీతాల పెంపు గురించి ఓ వారం పదిరోజులు సమయం తీసుకొని కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు. సినిమా షూటింగులు నిలిచిపోతే అందరం నష్టపోతామని సినీ కార్మికులు గుర్తుంచుకోవాలి. సినీ పెద్దలు కూడా ఈ సమస్యపై ఆలోచించుకొని తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

Related Post

సినిమా స‌మీక్ష