జీవితంలో ఎవరినీ నమ్మోద్దు: బండ్ల వేదాంతం

June 18, 2022


img

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఈరోజు ట్విట్టర్‌లో ఓ ఆడియో మెసేజ్ పెట్టారు. అది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. “జీవితంలో ఎవరినీ నమ్మోద్దు. మనల్ని మనమే నమ్ముకొందాం. మనకు జన్మనిచ్చిన తల్లితండ్రులను, మనల్ని నమ్మివచ్చిన జీవిత భాగస్వామిని, మనం జన్మ ఇచ్చిన్న పిల్లల్ని నమ్ముదాం. ప్రేమిద్దాం. వారికి మంచి అందమైన భవిష్యత్‌ అందిద్దాం. ఎంతకంటే వాళ్ళు మనపైనే కోటి ఆశలు పెట్టుకొని జీవిస్తున్నారు. మనం కొన్నిటిపై ఇష్టాలు పెంచుకొని మనవాళ్ళనుకొంటున్న వాళ్ళకి ఎన్నడూ అన్యాయం చేయొద్దు ,” అని దాని సారాంశం. 

అయితే బండ్ల గణేశ్ హటాత్తుగా ఇలాంటి మెసేజ్ ఎందుకు పెట్టారా? ఆయన ఎవరి చేతిలోనైనా మోసపోయారా? ఆ ఆవేదనతో ఈ మెసేజ్ పెట్టారా? అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇది ఆయన చేయబోయే సినిమాలో డైలాగ్ ఏమో? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆడియో ఫైల్ మీరు కూడా విని ఇంతకీ బండ్ల గణేశ్ ఇలా ఎందుకన్నారో ఆలోచించండి. 

  Related Post

సినిమా స‌మీక్ష