సినిమాలు వేరు...రాజకీయాలు వేరు: పవన్‌ కళ్యాణ్‌

June 10, 2022


img

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్‌ జంటగా నటించిన అంటే సుందరానికి చిత్రం నేడు విడుదలైంది. ఈ సందర్భంగా అంటే సుందరానికి ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న (గురువారం) హైద‌రాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, “సహజసిద్ధమైన నాని నటన అంటే నాకు చాలా ఇష్టం. ఏ విషయం పైనైనా నిర్భయంగా మాట్లాడే ఆయన వ్యక్తిత్వం అంటే నాకు చాలా గౌరవం. అంటే సుందరానికి తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను,’ అని అన్నారు. 

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాల గురించి కూడా సునిశిత విమర్శలు చేశారు. “ఈ సినీ ఇండస్ట్రీ ఏ ఒక్కరికో సొంతం కాదు మన అందరిదీ అనే భావనతో మెలగాలి. ఇండస్ట్రీలో భిన్న రాజకీయ దృక్పధాలు ఉన్నవారున్నారు. కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం అందరం ఒక్కటే. మన సినిమాలు బాగా ఆడాలని ఏవిధంగా కోరుకొంటామో అదేవిధంగా ఇతరుల సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీ పచ్చగా కళకళలాడుతుంది,” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.  

 నాని స్పందిస్తూ, “నేను ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్ళు అయ్యింది. ఈ 14 ఏళ్ళలో ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులను కలిశాను. కానీ ఇన్నేళ్ళ తరువాత తొలిసారిగా పవన్‌ కళ్యాణ్‌గారిని ఈ సందర్భంగా కలిసినందుకు నాకు చాలా తోషంగా ఉంది. ఆయనను ఇప్పుడే తొలిసారి కలిసినప్పటికీ నా చిన్నప్పటి నుంచే ఆయనతో కలిసి ఉన్న ఫీలింగ్ కలుగుతోంది,” అని అన్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష