ఎఫ్3లో పూజా హెగ్డే... లైఫ్ అంటే ఇలా ఉండాల!

May 16, 2022


img

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా ప్రధాన పాత్రలలో వస్తున్న ఎఫ్-3 సినిమాలో మూడో పాట ప్రమో వీడియో ఈరోజు విడుదల చేశారు. దీని పూర్తి సాంగ్‌ మంగళవారం విడుదల కాబోతోంది.

“హాత్ మే పైసా...మూతిమే సీసా…పోరితో సల్సా... లైఫ్ అంటే ఇట్టా ఉండాలా...” అంటూ కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను రాహుల్ సిప్లీగంజ్, గీతా మాధూరీ చాలా హుషారుగా పాడగా వెంకటేష్, వరుణ్ తేజ్ వారి మద్యలో ఎర్ర డ్రెస్సులో మెరిసిపోతూ పూజా హెగ్డే అంతే హుషారుగా చేసిన డ్యాన్స్ చాలా బాగుంది. దీనిలో పూజా హెగ్డే కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేశారు. ఈ పాటతో పాటు ఒక పార్టీ సాంగ్‌ను ఆఫ్ ది ఇయర్ పేరుతో ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 

ఎఫ్-3 లో వెంకటేష్‌కి  రేచీకటి, వరుణ్ తేజ్‌కి నత్తి సమస్యలున్నట్లు ట్రైలర్‌లో చూపారు. కనుక దాంతో వారిద్దరూ కామెడీని చూసి తీరాల్సిందే. వెన్నెల కిషోర్, సునీల్, మురళీశర్మ, రఘుబాబు, ఆలీ, నిర్మలమ్మ, వై.విజయ, ప్రగతి, కామెడీ ఈ సినిమాను మరో లెవెల్‌కి తీసుకువెళ్ళబోతోందని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది. 

ఈసారి సినిమా అంతా డబ్బు, బంగారం, ఈజీ మనీ చుట్టూ నడుస్తుందని ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది. ఈ నెల 27వ తేదీన ఎఫ్-3 విడుదల కాబోతోంది. శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఎఫ్3కి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించాడు.Related Post

సినిమా స‌మీక్ష