అమెజాన్ ప్రైమ్‌లోకి ఆచార్య వచ్చేస్తోంది

May 13, 2022


img

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ కలిసి నటించిన ఆచార్య ఈ నెల 20వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈవిషయం ఆ సంస్థ స్వయంగా ట్విట్టర్‌లో తెలియజేసింది. ఏప్రిల్ 29న ఆచార్య చాలా భారీ అంచనాల మద్య విడుదలైంది. కానీ దానిని మెగా అభిమానూలు సైతం జీర్ణించుకోలేకపోయారు. దాంతో మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చేసింది. 

ఆ తరువాత కొద్ది రోజులకే మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట రిలీజ్ అయిపోవడం, దానికి మిశ్రమ స్పందన వస్తుండటంతో ప్రేక్షకులు అటువైపు వెళ్లిపోతున్నారు. దీంతో ఆచార్య బాక్సాఫీస్ కలెక్షన్స్ పడిపోయాయి. ఆచార్య టాక్ విన్న సామాన్య ప్రేక్షకులు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ దాని కోసం థియేటర్లకు వెళ్ళడం ఎందుకని ఓటీటీలో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 20తో వారి ఎదురుచూపులు ముగుస్తాయి. Related Post

సినిమా స‌మీక్ష