సర్కారువారి పాటపై విజయసాయి రెడ్డి ట్వీట్

May 13, 2022


img

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట సినిమా గురువారం రిలీజ్ అయ్యి పర్వాలేదనిపించుకొంది. అప్పుడప్పుడు మంత్రి కేటీఆర్‌ తెలుగు సినిమాలు చూసి ట్విట్టర్‌లో తన అభిప్రాయం పంచుకొంటుంటారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా సర్కారువారి పాటపై తన అభిప్రాయాన్ని  తెలియజేశారు. 

“సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం సర్కారువారి పాట బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు. మహేష్ బాబు ఆల్ ది బెస్ట్” అని అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. Related Post

సినిమా స‌మీక్ష