బాలీవుడ్‌లో చేయననలేదు కానీ చేయను

May 11, 2022


img

సర్కారువారి పాట సినిమా రేపు విడుదల కాబోతున్న సమయంలో వివిద మీడియా ఛానల్స్‌కి మహేష్ బాబు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా మొన్న ఆయన “బాలీవుడ్‌ నన్ను భరించలేధు...నేను ఇక్కడే హ్యాపీ...” అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. 

మహేష్ బాబు హిందీ సినిమాలలో చేయకూడదని ఖచ్చితంగా నిర్ణయించుకొని ఆ విషయం చెప్పి ఉండవచ్చు. కానీ వచ్చే ఏడాది రాజమౌళితో కలిసి చేయబోయే సినిమా పాన్ ఇండియా మూవీ కనుక అది హిందీలో కూడా తప్పక రిలీజ్ చేస్తారు. 

బాలీవుడ్‌ నన్ను భరించలేదంటూ వ్యాఖ్యలు చేసినందుకు బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు, హిందీలో సినిమాలు చేయనని చెప్పినందుకు ఉత్తరాది రాష్ట్రాలలో హిందీ మాట్లాడే ప్రజలు ఇప్పుడు హర్ట్ అయితే, ఆ ప్రభావం మహేష్ బాబు-రాజమౌళి సినిమాపై పడే అవకాశం ఉంటుంది. 

ఇదే విషయం నిన్న ఓ విలేఖరి అడిగితే మహేష్ బాబు సమాధానమిస్తూ, “కళాకారుడినైనా నేను దేశంలో అన్ని భాషలను గౌరవిస్తాను. ఏ భాషకు, సినీ ఇండస్ట్రీకి నేను వ్యతిరేకం కాదు. మన తెలుగు సినిమాలే పాన్ ఇండియా మూవీలుగా హిందీలో కూడా రిలీజ్ అవుతున్నప్పుడు మళ్ళీ నేను ప్రత్యేకంగా బాలీవుడ్‌ వెళ్ళి అక్కడ హిందీ సినిమాలలో నటించడం ఎందుకు? ఇక్కడే తెలుగులో హ్యాపీగా సినిమాలు చేసుకొంటాను అని అన్నాను తప్ప బాలీవుడ్‌కి వెళ్ళడం నాకు ఇష్టం లేదని కానీ, అక్కడ సినిమాలు చేయనని గానీ అనలేదు,” అని అన్నారు.


Related Post

సినిమా స‌మీక్ష