నయనతార వివాహ జీవితంలో చిక్కులు?

May 11, 2022


img

ప్రముఖ నటి నయనతార, ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌లు త్వరలో తిరుమల శ్రీవారి సన్నిధిలో జూన్‌ 9న పెళ్ళి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి నయనతార జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానిలో గురుడు నీచ స్థితిలో ఉన్నాడని కనుక వారి వైవాహిక జీవితంలో కలతలు, విభేధాలు ఉంటాయని, చివరికి అవి విడాకులకు దారి తీయవచ్చని జోస్యం చెప్పారు. 

ఆమె ఒక్కరిదే కాదు... ప్రముఖ నటీమణులు అనుష్క శెట్టి, రష్మిక మందనల జాతకాలు కూడా అదేవిదంగా ఉన్నాయని కనుక వారి వైవాహిక జీవితాలలో కూడా ఒడిదుడుకులు, చివరకు భర్తతో విడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన, నయనతారల సినీ కెరీర్ 2024లో లేదా అప్పటి నుంచి క్రమంగా ముగిసిపోతుందని వేణుస్వామి జోస్యం చెప్పారు.

వేణుస్వామి గతంలో సమంత-నాగ చైతన్యలు వివాహం చేసుకొంటున్నప్పుడూ వారి జాతకాలు పరిశీలించి వారి కాపురం ఎంతో కాలం నిలబడదని, వారు విడిపోతారని జోస్యం చెప్పారు. చివరికి అదే నిజమైంది. కనుక నయనతార, విఘ్నేశ్‌ శివన్‌, అలాగే మిగిలిన హీరోయిన్ల పెళ్ళిళ్ళు, వైవాహిక జీవితాలు, సినీ కెరీర్‌పై ఆయన చెప్పిన జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది.


Related Post

సినిమా స‌మీక్ష