తెలంగాణ సర్కారువారి పాట..50 రూపాయలు

May 10, 2022


img

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట సినిమా ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచుకొనేందుకు అనుమతించింది. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి వారం రోజుల పాటు అదనంగా 5వ షో కూడా వేసుకొనేందుకు అనుమతించింది. అయితే ఉదయం 7 నుంచి రాత్రి ఒంటి గంటలోగా ఈ 5 షోలు ముగించాల్సి ఉంటుంది. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఈ మేరకు సోమవారం జీవో జారీ చేశారు. 

మొదటి పదిరోజులు మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.30 చొప్పున టికెట్ ధరలు పెంచుకొనేందుకు అనుమతి లభించింది. దాని ప్రకారం మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ.350, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.210 చొప్పున ప్రేక్షకులు చెల్లించ వలసి ఉంటుంది. Related Post

సినిమా స‌మీక్ష