కాబోయే భార్యని పరిచయం చేసేదిలాగా...రాహుల్?

May 08, 2022


img

ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు. అయితే కాబోయే భార్యను అతను పరిచయం చేసిన తీరే బాగోలేదు. ఆమెను ఘాడంగా ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. వారు పెళ్ళి చేసుకోవడం అభినందించాల్సిన విషయమే అయితే మాంసం తింటామని ఎవరూ ఎముకలు మెళ్ళో వేసుకొని తిరగరు కదా? అలాగే తాము ముద్దులు పెట్టుకుంటున్నట్లు అందరికీ ప్రదర్శించాల్సిన అవసరం లేదు కదా? 

వారి ఫోటోపై లోకులు ఏమనుకొంటున్నారో  అనే సంగతి పక్కనపెడితే వారిరువురి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఈ ఫోటో ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో వారికి తెలిసి ఉండాలి. వివిధ రంగాలలో ఇంతకంటే సుప్రసిద్ధులైనవారు సైతం ఎంతో హుందాగా ఫోటోలు తీయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహ్మాన్ కూడా ప్రేమించే పెళ్ళి చేసుకున్నారు. కానీ వారు పెళ్ళి చేసుకొన్న తరువాత కూడా ఎంతో హుందాగా ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో తమ అభిమానులతో షేర్ చేసుకుంటే చూడముచ్చటగా ఉన్న ఆ నవ దంపతులను చూసి అందరూ మనసారా ఆశీర్వదించారు. 

ఏకమైనప్పటికీ, రాహుల్ రామకృష్ణ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అందుకు చాలా సంతోషం. అభినందనలు. సోషల్ మీడియాలో తనకు కాబోయే భార్య గురించి నాలుగు ముక్కలు తెలియజేసి ఉంటే అందరూ ఇంకా సంతోషించి ఉండేవారు కదా? ఎందుకంటే, వారి పెళ్ళి సస్పెన్స్ సినిమా కాదు కదా...అందరూ ఆత్రంగా ఎదురుచూడటానికి!    Related Post

సినిమా స‌మీక్ష