ఆస్కార్ బరిలో జై భీమ్

January 22, 2022


img

సూర్య నటించిన జై భీమ్ నేరుగా ఓటీటీలోనే విడుదలైనప్పటికీ దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకొంది. చివరికి ఆస్కార్ అవార్డులకు కూడా నామినేట్ అయ్యింది. ఈ ఏడాది భారత్‌ నుంచి రెండు చిత్రాలు ఆస్కార్‌కు వెళ్ళగా వాటిలో ఒకటి జై భీమ్, మరొకటి మలయాళ చిత్రం మరక్కర్. వీటిలో జై భీమ్ ‘బెస్ట్ ఫీచర్ ఫిలిమ్’ విభాగంలో ఎంపికైంది. ఇది తప్పకుండా ఆస్కార్ అవార్డ్ గెలుచుకొంటుందని చాలా మంది నమ్మకంగా ఉన్నారు. 

1993లో తమిళనాడులో జరిగినన కొన్ని వాస్తవ ఘటనలలో అప్పటి మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చందూ చేసిన పోరాటమే జై భీమ్ కధకు మూలం. ఈ సినిమాలో సూర్య న్యాయవాది చంద్రుగా నటించారు. ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞనావెల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సూర్య, జ్యోతిక దంపతులు తమ సొంత నిర్మాణ సంస్థ2డి ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై దీనిని నిర్మించారు.    Related Post

సినిమా స‌మీక్ష