స్విట్జర్లాండ్‌లో సమంత... స్కీయింగ్

January 22, 2022


img

నాగ చైతన్యతో విడిపోయిన తరువాత సమంత జీవనశైలి పూర్తిగా మారిపోయినట్లు కనబడుతోంది. తనకు నచ్చినట్లు దేశవిదేశాలు తిరుగుతూ, తనకు నచ్చిన సినిమాలు చేస్తూ స్వేచ్చగా జీవిస్తోంది. ఎవరూ ఊహించని విదంగా పుష్పలో ‘ఊ అంటావా మావా...’ అంటూ అల్లు అర్జున్‌తో కలిసి ఆడిపాడిన సమంత, ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో మంచుపర్వతాలపై స్కీయింగ్ చేస్తూ హాయిగా గడుపుతోంది. ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకొంటూ, “నాలుగో రోజు... ఈ మ్యాజిక్ సాధ్యమైంది. స్కీయింగ్ చేయడం అంత సులువు కాదు... కానీ చాలా సరదాగా ఉంటుంది...” అని మెసేజ్ పెట్టింది. 

సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’, హరి-హరీష్ దర్శకత్వంలో యశోద అనే ఓ థ్రిల్లర్ మూవీ, తమిళంలో కాత్తువాక్కులా రెండు కాదల్ అనే ఓ చిత్రం,  ‘ఆరెంజ్‌ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే ఓ ఇంగ్లీష్ మూవీ చేస్తోంది.       Related Post

సినిమా స‌మీక్ష