పూర్తిగా కోలుకొన్న కైకాల సత్యనారాయణ

January 20, 2022


img

అలనాటి మేటి నటులలో ఒకరైన కైకాల సత్యనారాయణ గత ఏడాది నవంబర్‌లో తీవ్ర అనారోగ్యం పాలయ్యి హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకొన్న ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఆయనకు ఫోన్ చేసి పరామర్శించడమే కాకుండా, ఆయన చికిత్సకు అవసరమైన ఖర్చును అందించారు. అధికారులను హైదరాబాద్‌కు పంపించి ఆయనకు అవసరమైన ఇతర సహాయ సహకారాలు కూడా అందజేశారు. భగవంతుడి దయ వలన పూర్తిగా కోలుకొని ఇటీవలే ఇంటికి చేరుకొన్న కైకాల సత్యనారాయణ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖ వ్రాశారు. కష్టకాలంలో తమ కుటుంబం వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.       Related Post

సినిమా స‌మీక్ష