సినీ నటుడు శ్రీనివాస్ మృతి

January 20, 2022


img

తెలుగు సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) బుదవారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో కన్ను మూశారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు శ్రీనివాస్‌కు ఛాతిపై బలంగా దెబ్బ తగిలింది. అప్పటి నుంచి గుండె సమస్యతో బాధపడుతూ కాశీబుగ్గ పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బుదవారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయారు. 

శ్రీనివాస్ ఆది, శంకర్ దాదా ఎంబీబీఎస్, ప్రేమ కావాలి వంటి సుమారు 40కి పైగా సినిమాలలో నటించారు. పది టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. శ్రీనివాస్ తండ్రి, తమ్ముడు కొన్నేళ్ళ క్రితం చనిపోయారు. శ్రీనివాస్ ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లు అయిపోవడంతో తల్లి విజయలక్ష్మి ఒక్కరే కాశీబుగ్గలో ఉంటున్నారు.            



Related Post

సినిమా స‌మీక్ష